అతని పేరు చింపు. అదేం పేరు? ఆయన ఇష్టమండి, మనం ఏం చేస్తాం చెప్పండి?అది అక్టోబర్ 2. ఆ పెద్దాయన పుట్టిన రోజు కదా, సెలవు. సెలవు కదా అని పడుకుందాంలే అనుకుంటే, అది పిచ్చ భ్రమ అని అర్ధం అయింది. తెల్లారు ఝామునే ఏడున్నరకి మెలకువ వొచ్చేసింది. ఇంకా చచ్చినా నిద్ర పట్టి చావలేదు. పోనీలే అని పేపర్ తీసి చదవడం మొదలు పెట్టాడు, పాచి మొహంతో.
పేపర్లో ఒక విచిత్రం కంట పడింది చింపుకి. "జీవితంలో చేసిన పనే చేసి చేసి విసిగి పోయారా? అయితే స్వామీ జిగిలిగానంద గారికి ఫోన్ కలపండి". అని ఉంది. కింద ఒక నక్షత్రం పెట్టి, ఈ ఫోన్ చేస్తే దురద చార్జీలు వర్తిస్తాయి, అని కూడా రాసి ఉంది. ఎందుకనో కానీ చింపుకి ఆవేశం వొచ్చింది, కాస్త గుండెలో ఎవరో కాలు జారి పడ్డట్టు కూడా అనిపించింది. అదేంటి? ఏమో మరి, అలాంటి చిత్రాలు చింపుకి కామన్.
వెంటనే ఫోన్ తీసి డయల్ చేసాడు. ఫోన్ మోగింది, ఎవరో ఎత్తారు. కట్ అయిపొయింది. అదేంటి? "మీ పిసినారి
మొబైల్ లో నెలగా మిగుల్చుకున్న 100 రూపాయల balance దుంప నాశనం అయింది. మళ్ళీ recharge చేసి తగలడండి" అని ఒక అమ్మాయి తిప్పుకుంటూ చెప్పింది ఫోన్లో. ఆహా, దురద చార్జీలు అంటే దూల తీర్చే చర్జీలన్న మాట. బాగుంది బాగుంది బాగుంది". అనుకున్నాడు చింపు. "ఏమైనా సరే, ఈ జ్ఞానాన్ని గ్రోలేయ్యాలి", అనుకున్నాడు. రీచార్జ్ చేయించి మరీ ఫోన్ చేసాడు చింపు. అవతల ఈ సారి ఒక మగ గొంతు మోగింది. అప్పుడే వెనక వివిధ భారతి లో మ్రోగింది వీణ పాట మొదలు అయింది. ఫోన్లో మగ గొంతుకి గడ్డం మొలిచినట్టు అనిపించింది చింపుకి. ఆ ఆలోచనకి కిచ కిచ నవ్వు వొచ్చి, పొట్టలో ఎవరో పుక్కిలించి ఉమ్మేసినట్టు అనిపించింది.
చింపు నవ్వుకి గడ్డం మొలిచిన గొంతుకు కోపం వొచ్చింది. రెండు సంస్కృత పదాలు తిట్లుగా వాడి, ఆయన చెప్పేది చెప్పేసాడు. "జీవితం అదోలా ఉంటె, ఇవాళ మీ పని ఒకటి మీరే చెడగొట్టు కొండి! అలా చెయ్యడం వల్ల లక లక గ్రహానికి శాంతి లభిస్తుంది. మీకు ఒక జిలేబి లాంటి లాభం కలగబోతోంది." అని చెప్పారు గడ్డం గొంతు వారు. ఈ లక లక గ్రాహం ఎప్పుడు కనిపెట్టారు, అని అడక్కండి. కామెడి కధల్లో లోజిక్కులు వెతక్కండి.
చింపు ధబాల్న లేచి నిలబడ్డాడు. స్నానం చేసి వొచ్చాడు. అమ్మ పెట్టిన చీవాట్లతో పాటూ, ఇడ్లీలు కూడా నీళ్ళల్లో ముంచుకుని తినేసాడు (పచ్చడి చెయ్యడం మరచిపోయిది మమ్మీ). వెంటనే ఆలస్యం చెయ్యకుండా వెళ్లి పళ్ళు తోముకుని వోచ్చేసాడు. (ఆ ఏం పోయిందట, ఇప్పుడన్నా గుర్తొచ్చి తోముక్కున్నాడు, సంతోషించండి).
చింపు కి మధ్యానం మూడు గంటలకి పెళ్లి చూపులు, అమీర్పేటలో అమ్మాయి వాళ్ళ ఇల్లు. మూడు గంటలకి మమ్మీ డాడీ చింపు బాబు వెళ్ళాల్సి ఉంది. కానీ, బాబు ఇప్పుడే అమీర్పేట బయల్దేరిపోయాడు. డైరెక్ట్ గా శక్తి కపూర్ గారి ఇంటి గేటు తీసుకుని లోపాలకి వెళ్ళాడు. శక్తి కపూర్ వాళ్ళ అమ్మాయి పద్మిని కొల్హా పూరి. పాచి మొహంతో నైటీ వేస్కుని చింపిరి జుట్టు గోక్కుంటూ బయటికి వొచ్చి తలుపు తీసింది. డేంజరస్ గా ఇకిలించాడు చింపు. Dinosaurకి అనీజీ గా ఉంటే అది చేసే లాంటి ఒక సౌండు చేసింది ఆ అమ్మాయి. విచిత్రంగా గెంతుతూ పైకి పరిగెత్తింది.
చింపుకి వెంటనే గోడకి శక్తి కపూర్, వల్ల ఆవిడ పద్మనాభామ్మ ఫోటో కనపడింది. రెడీగా పెట్టుక్కున్న సీడీ మార్కర్ బయటికి తీసి, ఫోటో లో వాళ్ళ ఇద్దరికీ మీసాలు పెట్టాడు. కాసేపు తన పనితనం చూసి గర్వ పడుతుండగా, శక్తి కపూర్ కాఫీ కప్పులతో వొచ్చారు. వంటింటి లోంచి పద్మనాభామ్మ తొంగి చూస్తూ ఉండడం చింపుకి కనపడింది. శ్రీలంక లో ఎల్టిటిఈ పోరాటంలో భయపడి గుడిసె లోనుంచి బయటికి పరిగెడుతున్న జిమ్గిరి మహిళా లా ఉంది.
శక్తి కపూర్ వోచ్చేలోగా స్పీడ్ గా కదిలాడు చింపు. సర సర పరిగెత్తి నెల మీద జార్రున జారి ఆవిడ జుట్టు పట్టుకుని పర పర పీకి, ఇంకాస్త చింపిరి చేసాడు. చిన్న సైజు అడవిలా తయారింది అది. అదే వేగంతో వొచ్చి సోఫా లో కూర్చున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఆవిడ డాల్బీ రేంజ్ అరుపులు వొస్తుండగా, శక్తి కపూర్ చేతిలోంచి కాఫీ కప్పు లాక్కుని, వేడి వేడి కాఫీ ఆయన జేబులో పోసాడు. అదే ఉదుటున జేబులోంచి బిస్కెట్ తీసి ఆయన కాఫీలో ముంచుకుని తినేసాడు. శక్తీని అంతా కూడా గట్టుకుని ఊపిరి గట్టిగా తీసి, బ్రేవ్ అని భీకరంగా త్రేంచాడు.అంతే! ఎంత వేగంగా వోచ్చాడో, అంత వేగంగా వెళ్ళిపోయాడు చింపు. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.
ఇలా గడ్డం గళం మాట విని, తన పెళ్లి చూపులు తనే చాడగోట్టుకున్నాడు చింపు. దీనివల్ల, ఎలాంటి జిలేబి ట్విస్ట్ రాబోతోందో అని ఆత్రుతగా ఎదురు చూడ సాగాడు. రెండు రోజుల తర్వాత కొరియర్ లో ఒక చెక్కు వొచ్చీన్ది. కోటి రూపాయలు. దానితో పాటే మ్రోగింది ఫోను.
"బాబూ, నువ్వు వెళ్లి ముదనష్టపు పనులు చేసింది శక్తి కపూర్ ఇల్లు కాదు. శశి కపూర్ ఇల్లు. రాంగ్ హౌస్. శశి కపూర్ వాళ్ళు మా ఇంట్లోనే అద్దెకు ఉంటారు. ఖాళీ చెయ్యమంటే పదేళ్లుగా చెయ్యట్లేదు. రౌడీల తో బెదిరించినా లైట్ తీసుకున్నారు. నువ్వు వొచ్చి వెళ్ళాక, "అతనే నాకు కాబోయే అల్లుడు, మా అమ్మాయికి పెళ్లి చెయ్యబోతున్నాం, ఇల్లరికం, ఇంకా రోజూ మీతో చాల ఫ్రెండ్లీ గా ఉంటాడు" అని చెప్పను. ఇల్లు ఖాళీ చేసి పోయారు. నా సంతోషంతో, ఆ ఇల్లు అమ్మిన డబ్బు లాభంలో నీకూ share ఇస్తున్నా. మా అమ్మాయిని మాత్రం, ఇవ్వను సారీ" అని పెట్టేసాడు.

ఇంకా చింపు గారు కూలి కి (అదే, ఏ పని అయితే ఏంటి, అన్నిటిని ఈ మధ్య కూలి అనే అంటున్నాం, అప్డేట్ అవ్వాలి మీరు...) రిజైన్ చేసి, ముదనష్టపు పన్లు చెయ్యడం మీద ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆఫీస్ రూంలో గడ్డం గళం ఆయన ఫోటో వేల్లాడుతూ ఉంటుంది.

No comments:
Post a Comment